: దేశంలోనే జగన్ పెద్ద భూబకాసురుడు : మంత్రి ప్రత్తిపాటి


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దేశంలోనే పెద్ద భూ బకాసురుడు అని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధానిలో టీడీపీ నేతలకు భూములున్నాయంటూ జగన్ తన సొంత పత్రికలో రాయడంపై ఆయన మండిపడ్డారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో భూములున్నాయంటూ ఎవరి పేర్లయితే రాశారో.. వారిలో ఒక్కరికైనా అక్కడ భూములుంటే ప్రజలకు పంచిపెడతామన్నారు. జగన్ అవినీతిపరుడు కనుక, ఆయనకు అందరూ అదేవిధంగా కనపడతారన్నారు. ఈ తప్పుడు వార్తలు రాసినందుకు గాను వారిపై సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని, పరువునష్టం దావా వేస్తామని చెప్పారు. ఈ విషయమై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేస్తున్నామన్నారు. అక్రమాస్తులు కూడబెట్టడంలో పితామహుడు జగన్మోహన్ రెడ్డి అని, అతి తక్కువ కాలంలో ఎక్కువ కూడబెట్టినటువంటి పలు కేసుల్లో నిందితుడైన జగన్ లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో అసలు ఎవరైనా ఉన్నారా? అంటూ ప్రత్తిపాటి ప్రశ్నించారు. అటువంటి వ్యక్తికి బొత్స వంటి నేతలు సిగ్గు లేకుండా వత్తాసు పలుకుతున్నారని ప్రత్తిపాటి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News