: ఫేస్ బుక్ డిప్యూటీ చీఫ్ అరెస్ట్... ఇదో విచారకరమైన రోజన్న మార్క్ జుకర్ బర్గ్


మాదక ద్రవ్యాల కేసులో విచారణకు సహకరించడం లేదని ఆరోపిస్తూ బ్రెజిల్ పర్యటనలో ఉన్న సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ ఉపాధ్యక్షుడు డియాగో జార్జ్ జోడెన్ ను అరెస్ట్ చేయడం కలకలం సృష్టించింది. ఈ కేసులో ఫేస్ బుక్ అనుబంధ వాట్స్ యాప్ మాధ్యమంగా నిందితులు పంపుకున్న సందేశాల వివరాలను అందించాలని విచారణ జరుపుతున్న న్యాయమూర్తి సెర్జీప్ కోరగా, అందుకు డియాగో స్పందించ లేదు. దీంతో వ్యవస్థీకృత నేరాల చట్టం కింద అరెస్ట్ వారెంట్ జారీ కాగా, ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ, "ఇది ఓ విచారకరమైన రోజు. డియాగో అరెస్ట్ నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది" అన్నారు. మరోవైపు నేరాల నియంత్రణకు వాట్స్ యాప్ సహకరించాల్సిందేనని బ్రెజిల్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News