: రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు
రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని, పరీక్షల నిర్వహణకుగాను రాష్ట్ర వ్యాప్తంగా 1,257 కేంద్రాలను ఏర్పాటు చేశామని సంబంధిత శాఖాధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి వరుసగా 4,56,655 మంది, 5,08,009 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గుర్తించిన 118 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లపై నిఘా కోసం జీపీఆర్ఎస్ వ్యవస్థ ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వస్తే అనుమతించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.