: ఆస్కార్ దక్కించుకున్నందుకు..కంగ్రాట్స్ డార్లింగ్: మంచు లక్ష్మి


ప్రముఖ సినీనటి, నిర్మాత, టీవీ షోల వ్యాఖ్యాత మంచు లక్ష్మి చాలా ఆనందంగా ఉంది. అందుకు కారణం, అమెరికాలోని తన ఫ్రెండ్ కు ఆస్కార్ అవార్డు రావడమే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 'రూమ్' చిత్రంలో బ్రీ లార్సన్ నటనకు ఆమెకు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్ అవార్డు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న మంచు లక్ష్మి సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘మిస్ బ్రీ లార్సన్.. నేను ఎంతో గర్వంగా ఉన్నాను. కలలు సాకారం చేసుకోవచ్చని నువ్వు నిరూపించావు. కంగ్రాట్స్ డార్లింగ్’ అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొంది. అలాగే, గతంలో లార్సన్ తో కలసి తాను దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేసింది. కాగా, లక్ష్మి ఆమధ్య బ్రీలార్సన్ తో కలిసి 'బాస్మతి బ్లూస్' అనే హాలీవుడ్ మూవీలో నటించింది. అప్పటి నుంచి వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సినిమాలో లార్సన్ సైంటిస్టుగా, మంచు లక్ష్మి భారతీయ మహిళగా నటించారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

  • Loading...

More Telugu News