: పెదబాబు దోస్తుంటే...చినబాబు దాస్తున్నాడు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆరోపణ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెదబాబు దోస్తుంటే... చినబాబు దాస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో 'దోచుకో-దాచుకో' పథకాన్ని అమలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ఇప్పటివరకు టీడీపీ పెద్దలే ఇసుకను దోచుకున్నారని, ఇకపై ఉచిత ఇసుక పేరిట కార్యకర్తలు కూడా దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. 2016-17 సాధారణ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పటికీ టీడీపీ నేతలు నోరు మెదపకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని వీరభద్రస్వామి విమర్శించారు.

  • Loading...

More Telugu News