: గ్లోబల్ టాప్ ఎంప్లాయర్ గా టీసీఎస్!


ప్రపంచంలో అత్యధికంగా ఉద్యోగావకాశాలు దగ్గర చేస్తున్న సంస్థగా భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ నిలిచింది. అధిక ఉద్యోగాలను ఇస్తున్న కంపెనీల జాబితాను 'టాప్ ఎంప్లాయర్ ఇనిస్టిట్యూట్' తయారు చేయగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తొలి స్థానంలో నిలిచి 'గ్లోబల్ టాప్ ఎంప్లాయర్' హోదాను దక్కించుకుంది. తాము మొత్తం 1,072 కంపెనీలను పరిశీలించామని, ఈ కంపెనీల మానవ వనరుల విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించామని ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. ఉద్యోగుల సంఖ్యతో పాటు, వారిలో నైపుణ్యం, పని వాతావరణం, అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేశామని పేర్కొంది. ఇంతటి ఘనత తమ సంస్థకు దక్కడం వెనుక క్లయింట్ల నమ్మకం, ప్రతి ఉద్యోగి కృషి ఉన్నాయని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News