: కేసును నేనే చూస్తున్నా...నిందితులను వదిలేది లేదు: ఎస్పీ జోయల్ డెవిస్


కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో జరిగిన యువతిపై సామూహిక అత్యాచారం కేసును తానే స్వయంగా దర్యాప్తు చేస్తున్నానని ఎస్పీ జోయల్ డెవిస్ తెలిపారు. ఈ ఘటనలో నిందితులెవర్నీ వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన పోలీసులను కూడా వదలనని ఆయన చెప్పారు. ఈ ఘటనలో బాధితురాలిని విచారించానని ఆయన తెలిపారు. నిందితుల ఆగడాల గురించి ఆమె వివరించిందని ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లాలో షీటీమ్స్ ను పటిష్ఠం చేస్తామని ఆయన అన్నారు. నిందితుల వయసు నిర్ధారణకు మెడికల్ టెస్టులు చేస్తామని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించే అవకాశం లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News