: భారీగా తగ్గిన పెట్రోలు ధర...డీజిల్ మాత్రం పెరిగింది!
పెట్రోలియం కంపెనీలు భారీ ఎత్తున పెట్రోలు ధరను తగ్గించగా, మరోపక్క డీజిల్ ధరను ఒక్కసారిగా పెంచేశాయి. లీటర్ పెట్రోలుపై ఒకేసారి 3.02 రూపాయలు తగ్గించగా, లీటర్ డీజిల్ ధరపై 1 రూపాయి 47 పైసలు పెంచినట్టు తెలిపాయి. దీంతో వాహనదారుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. గతంలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పతనమైన సందర్భాలలో వివిధ పన్నుల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ధరను అంతో ఇంతో పెంచాయి. అయితే, బడ్జెట్ ప్రకటించిన వెంటనే వీటి ధరను సమీక్షించడంపై ఇప్పుడు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన పథకాలకు కేటాయింపులు తక్కువయ్యాయన్న ఆందోళనలు తలెత్తకుండా కేంద్రం సరికొత్త ఎత్తుగడగా ఈ తగ్గింపును ప్రకటించి ఉంటుందని భావిస్తున్నారు.