: కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలికొదిలేసింది: ముద్రగడ
కొన్ని రోజుల నుంచి రాయలసీమ, కోస్తాంద్రలో పర్యటిస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. తన దీక్షా సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. రూ.500 కోట్లు విడుదల చేస్తామని చెప్పిందని, ఇంకా వాటిపై ఎలాంటి స్పందన లేదని ఆగ్రహించారు. అంతేగాక మంజునాథ కమిషన్ లో తాను సూచించిన ఒక వ్యక్తికి సభ్యత్వం ఇస్తామని చెప్పారని, కానీ అదేమీ జరగలేదన్నారు. అటు కేసు విషయంలో కూడా అమాయకులను అరెస్టు చేస్తున్నారని ముద్రగడ విమర్శించారు.