: తెలంగాణ కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం


కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, నియోజకవర్గ ఇన్ చార్జి కేతిరి సుదర్శన్ రెడ్డి(60) గుండెపోటుతో మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ లో ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆయన పని చేశారు. సుదర్శన్ రెడ్డి మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, ఆయనకు భార్య అరుణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అరుణ జూపాక గ్రామ సర్పంచిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News