: ఇక టీచర్లూ టెన్త్ పరీక్ష రాయాల్సిందే... తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం!


ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులే కాదు, వారికి పాఠ్యాంశాలు చెప్పే టీచర్లూ పరీక్షలు రాయాల్సిందే. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల పరీక్షలు ముగిసిన వెంటనే టీచర్లకు పరీక్ష పెట్టాలని, దీని ద్వారా సిలబస్ లో చేయాల్సిన మార్పులు, కొత్త విధానంపై అధ్యయనానికి వీలవుతుందని, విద్యార్థుల సాధక బాధకాలూ తెలుసుకోవచ్చన్నది కేసీఆర్ ప్రభుత్వం అభిమతం. అందుకే భవిష్యత్తులో చేయాల్సిన మార్పుల గురించి ఈ ప్రయోగం చేస్తున్నట్టు విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలకాలన్నదే తమ ఉద్దేశమని, ఒక్కో సబ్జెక్టు నుంచి ఎంపిక చేసిన కొంతమంది టీచర్లకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు ఉదయం సాగనుండగా, ఆ వెంటనే మధ్యాహ్నం పూట ఉపాధ్యాయులు అవే పరీక్షలను రాయాల్సి వుంటుంది. వీరి పేపర్లనూ ఇన్విజిలేటర్లు సరిచేస్తారు. ఆపై వారిచ్చే నివేదికల ఆధారంగా మార్పులు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

  • Loading...

More Telugu News