: భారత్ తో ఓటమిపై పాకిస్థాన్ ఎప్పట్లానే స్పదించింది


ఆసియాకప్ లో భాగంగా బంగ్లాదేశ్ వేదికగా పాకిస్థాన్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో తమ జట్టు ఓటమిపాలవ్వడంపై పాకిస్థానీయులు తట్టుకోలేకపోయారు. ఆ ఓటమిని వెంటనే జీర్ణించుకోలేకపోయారు. దీంతో పలు పట్టణాల్లో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లను ధ్వంసం చేశారు. పంజాబ్ ప్రావిన్స్ లో పాకిస్థాన్ టీమ్ దిష్టిబొమ్మలని దగ్ధం చేశారు. ఇక ఆ జట్టుపై ఎప్పట్లానే విమర్శల వాన కురుస్తోంది. ఎన్నిసార్లు క్షమాపణలు అడుగుతారు? ఇకనైనా ఆడరా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, పాక్ కెప్టెన్ అఫ్రిది మాట్లాడుతూ, ఈ మ్యాచ్ తోనే అంతా అయిపోలేదని, జట్టు పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News