: హాట్ ఫేవరేట్ ఇండియానే!: స్టీవ్ వా


2016 టీట్వంటీ ప్రపంచ కప్ హాట్ ఫేవరేట్ భారత జట్టేనని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా తెలిపాడు. పిచ్ లపై పూర్తి అవగాహన ఉండడం ఆ జట్టుకు లాభించనుండగా, మంచి ఫాంలో ఉండడం కూడా ఆ జట్టుకు అద్వితీయ విజయాలు అందించే అవకాశం ఉందని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఆటగాళ్లు గత కొంత కాలంగా పొట్టి ఫార్మాట్ లో విజయాల బాటపట్టారని, అది సానుకూల ఫలితాలు తెచ్చేందుకు ఉపయోగపడుతుందని వా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా కూడా టైటిల్ రేసులో ఉందని స్టీవ్ వా అన్నాడు. స్మిత్ కెప్టెన్సీలో ఆసీస్ బాగా రాణిస్తోందని కితాబు ఇచ్చాడు. కేవలం ఒక్క ఓవర్ లో ఫలితం తారుమారయ్యే టీట్వంటీల్లో విజేతను ముందుగా పేర్కోవడం తొందరపాటు అవుతుందని స్టీవ్ వా తెలిపాడు.

  • Loading...

More Telugu News