: 'నెస్ట్ అవే'లో రతన్ టాటా పెట్టుబడులు


పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరో స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పటి వరకు 19 స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన రతన్ టాటా తాజాగా 'నెస్ట్ అవే'లో పెట్టుబడి పెట్టారు. దేశంలోని ప్రముఖ పట్టణాల్లో నెస్ట్ అవే అంకుర పరిశ్రమ అద్దెఇళ్లు సమకూర్చడంలో సహాయం చేస్తోంది. వినియోగదారుల బడ్జెట్ లో అద్దెఇళ్ల సమాచారం అందించే నెస్ట్ అవేకు వివిధ పట్టణాల్లో ఆదరణ లభిస్తోంది. దీనిని 2015లో అమరేంద్ర సాహు, స్మృతీ పరీదా, దీపక్ ధార్, జితేంద్ర జగదేవ్ లు ప్రారంభించారు. 2016లో టాటా పెట్టుబడులు పెట్టిన 8వ కంపెనీ నెస్ట్ అవే!

  • Loading...

More Telugu News