: కాంగ్రెస్ లో చేరాలనుకున్నారు... స్మృతీ ఇరానీపై మరో బాంబేసిన దిగ్విజయ్!


బీజేపీలో చేరడానికి పూర్వం స్మృతీ ఇరానీ కాంగ్రెస్ లో చేరాలని భావించారని కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యత్వం కోసం ఆమె ప్రయత్నించారని, ఆమె ఈ విషయాన్ని ఖండించలేరని అన్నారు. పలువురు ఏఐసీసీ నేతలను ఆమె కలిశారని చెప్పిన దిగ్విజయ్ సింగ్, వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. గుజరాత్ అల్లర్ల తరువాత నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన స్మృతీ, ఆపై అదే పార్టీలో చేరడం తమను ఆశ్చర్యపరిచిందని ఆయన అన్నారు. "ప్రస్తుతం మానవ వనరుల మంత్రిగా ఉన్న ఆమె, 2002, డిసెంబర్ 25న నిరాహార దీక్ష చేశారు. నరేంద్ర మోదీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, వాజ్ పేయి పుట్టిన రోజునాడు ఆమె నిరసనకు దిగారు. ఇప్పుడామె మతం, దేశభక్తి గురించి మనకు పాఠాలు చెబుతుండటం విడ్డూరం" అని వ్యాఖ్యానించారు. ఇక ఆమె తన విద్యార్హతల గురించి వాస్తవాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News