: లేపాక్షి ఉత్సవాల్లో శోభాయాత్ర ప్రారంభం


అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాల శోభాయాత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నంది విగ్రహం నుంచి సభాస్థలి వరకు సుమారు రెండు కిలోమీటర్లు ఈ శోభాయాత్ర సాగనుంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెయ్యి మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన, జానపద కళాకారులతో కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. శోభాయాత్ర అనంతరం లేపాక్షి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బహిరంగ సభ జరగనుంది.

  • Loading...

More Telugu News