: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్


ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఈరోజు ఆసక్తికర పోరు బంగ్లాదేశ్ లోని మిర్ పూర్ లో ప్రారంభం మైంది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నలుగురు పేసర్లతో పాక్ బరిలోకి దిగుతోంది. కాగా, మ్యాచ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో అజింక్య రహానేను కెప్టెన్ ధోనీ తుదిజట్టులోకి తీసుకున్నాడు. వచ్చే నెలలో జరిగే ట్వంటీ 20 ప్రపంచ కప్ సన్నాహకంగా భావిస్తున్న ఆసియా కప్ లో ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే జోరును పాకిస్థాన్ పై కూడా కొనసాగించేందుకు టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ బౌలర్లు సమర్థంగా రాణించినప్పటికీ, ఓపెనర్ రోహిత్ శర్మ, మిడిల్ ఆర్డర్ లో పాండ్యా మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పడాలని ధోనీ సేన భావిస్తోంది. మరోవైపు, ఈసారైనా కీలక టోర్నీలో గెలిచి భారత్ పై విజయం సాధించాలనే పట్టుదలతో పాకిస్థాన్ ఉంది. నిషేధం తర్వాత పాక్ జట్టులోకొచ్చిన మహమ్మద్ అమీర్ పైనే అందరి దృష్టి నెలకొంది.

  • Loading...

More Telugu News