: 'వంగవీటి'లో జరిగిందే చూపిస్తా: రాంగోపాల్ వర్మ
తాను తీయబోయే 'వంగవీటి' సినిమాలో జరిగిన కథనే యథార్థంగా చూపించే ప్రయత్నం చేస్తానని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. ఇందులో ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేసి చూపించనని స్పష్టం చేశారు. విజయవాడలో కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూను కలసిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రంలో నెహ్రూది కీలక పాత్ర అని చెప్పారు. అందుకే ఆయనతో కథాపరంగా చర్చించానని వివరించారు. తమ ఇద్దరి మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని పేర్కొన్నారు.