: బాలయ్య డైలాగ్స్ చెప్పి.. భళా అనిపించుకున్న చిన్నారి!


హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణ నటించిన పలు చిత్రాల్లోని డైలాగ్ లను ఒక చిన్నారి అనర్గళంగా, అవలీలగా చెప్పింది. అందరితో ‘భళా’ అనిపించుకుంది. అనంతపురం జిల్లాలో ఈరోజు ప్రారంభమైన లేపాక్షి ఉత్సవాల్లో ఒక చిన్నారి సందడి చేసింది. బాలకృష్ణ చిత్రాల్లోని పంచ్ డైలాగ్ లను ఆ చిన్నారి చెబుతుంటే కరతాళ ధ్వనులు, ఈలలతో ఉత్సవాల ప్రాంగణం మార్మోగిపోయింది. స్టేజ్ పై నిలబడి ఎటువంటి బెరుకు లేకుండా ధైర్యంగా డైలాగ్ లు చెప్పిన చిన్నారిని బాలయ్య సహా పలువురు ప్రశంసించారు.

  • Loading...

More Telugu News