: సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న కేజ్రీ సర్కారు... ఏడాది పాలన విజయవంతమైందంటూ ప్రచార హోరు


సివిల్ సర్వెంట్ గా నిజాయతీపరుడన్న పేరును సంపాదించుకున్న అరవింద్ కేజ్రీవాల్... రాజకీయ పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ పేరిట రాజకీయ తెరంగేట్రం చేశారు. అప్పటిదాకా సివిల్ సర్వెంట్ గా సంపాదించుకున్న మంచి పేరు ఆయనకు రాజకీయాల్లో మంచి ఫలితాలనే అందించింది. ఏడాది వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన తాజాగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీ సర్కారు... తాను కూడా ఇతర పార్టీల కంటే భిన్నమేమీ కాదని చెప్పకనే చెప్పింది. ఏడాది పాలనలో కేజ్రీ సర్కారు మెరుగైన పాలనను అందించిందంటూ పలువురి చేత చెప్పిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అన్ని జాతీయ ఛానెళ్లతో పాటు ప్రాంతీయ ఛానెళ్లు, కొన్ని పత్రికల్లోనూ ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నుంచి భారీ ప్రకటనలు ప్రసారమవుతున్నాయి. సరి-బేసీ విజయం, త్వరలో రెండో దఫా సరి-బేసి, ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తగ్గిపోయిన వైనం, అవినీతి రహిత పాలన...తదితరాలను ప్రస్తావిస్తూ ఈ ప్రకటనల హోరు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News