: విరాట్ కోహ్లీ పాక్ అభిమానికి బెయిలు


క్రికెటర్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ అభిమాని ఉమెర్ దరాజ్ కు బెయిలు మంజూరైంది. రూ.50వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ పంజాబ్ ప్రావిన్స్ లోని ఒకారా అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. జనవరిలో ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య అడిలైడ్ లో జరిగిన టీ20 మ్యాచ్ లో కోహ్లీ 90 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. దాంతో ఉమెర్ పట్టలేని సంతోషంతో పాక్ లోని తన నివాసంపై భారత జాతీయ జెండాను ఎగుర వేశాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చెప్పడంతో వెంటనే అతన్ని అరెస్టు చేశారు. కేవలం కోహ్లీపై అభిమానంతోనే తానలా భారత జెండా ఎగురవేశానని కోర్టులో విచారణ సందర్భంగా తెలిపాడు. ఈ క్రమంలో ఈ నెల 18న బెయిలు కోసం పిటిషన్ పెట్టుకున్నా కోర్టు తిరస్కరించింది. తాజాగా అతనికి ఊరట లభించింది.

  • Loading...

More Telugu News