: ఏపీలో ఇక ఫ్రీగా ఇసుక!... కీలక నిర్ణయాన్ని ప్రకటించిన చంద్రబాబు సర్కారు


ఇళ్ల నిర్మాణంలో కీలకమైన ఇసుక కోసం ఇకపై ఏపీ వాసులు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉచితంగానే ఇసుకను అందించేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక వేలం ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరుతున్నా, అంతకంటే ఎక్కువగా చెడ్డ పేరే వస్తున్న నేపథ్యంలో ఇసుకపై సెస్ ను వదులుకునేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అంతేకాక ఇళ్ల నిర్మాణంలో కీలకమైన ఇసుకను పేదలకు ఉచితంగానే ఇవ్వడం ద్వారా సొంతింటి కలను మరింత సులువు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాత నిన్న ప్రకటించారు.

  • Loading...

More Telugu News