: షిర్డీలో వీఐపీ పాస్ ల ధర పెంపు... భక్తులకు ఉచిత ప్రసాదం


మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్య క్షేత్రం షిర్డిలో వీఐపీ దర్శనం పాస్ ల ధరలు పెరిగాయి. దీంతో పాటు ఉదయం, మధ్యాహ్నం హారతుల వీఐపీ పాస్ ల ధరలు పెరిగినట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్ఎస్ఎస్టీ) కార్యనిర్వాహక అధికారి బాజీరావ్ షిండే పేర్కొన్నారు. ఈరోజు ఒక ప్రకటన చేశారు. వీఐపీ పాస్ ల ధర రూ.100 నుంచి రూ.200కు, ఉదయం హారతి వీఐపీ పాస్ ధర రూ.500 నుంచి రూ.600కు, మధ్యాహ్నం హారతి వీఐపీ పాస్ ధర రూ.300 నుంచి రూ.400కు పెరిగినట్లు పేర్కొంది. సాధారణ భక్తులకు ఉచితంగా ప్రసాదం అందించనున్నారు. మార్చి ఒకటి నుంచి భక్త నివాస్ లో వీఐపీ పాస్ విక్రయ కౌంటర్ ను ప్రారంభించనున్నామని, అదే తేదీ నుంచి పెరిగిన పాస్ ధరలు అమల్లోకి వస్తాయని ఎస్ఎస్ఎస్టీ పేర్కొంది.

  • Loading...

More Telugu News