: కేంద్రానికి, టీఆర్ఎస్ కు మధ్య ఉన్నవి ప్రభుత్వపరమైన సంబంధాలే!: ఎంపీ కవిత
టీఆర్ఎస్ కు కేంద్రానికి మధ్య ఉన్నవి ప్రభుత్వపరమైన సంబంధాలే తప్ప వేరే ఏమీ కాదని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని కలిశారని, ఆ తర్వాతే రాష్ట్రంలో కొన్ని పనులు వేగవంతమయ్యాయని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో టీఆర్ఎస్ చేరుతుందంటూ వార్తలు వస్తున్నాయని... ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ లో విభజన చట్టంలో ఉన్న వాగ్దానాలకు నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కవిత డిమాండ్ చేశారు.