: వంగవీటి రత్నకుమారి అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు: దర్శకుడు వర్మ


తనకు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు వంగవీటి రంగా భార్య రత్నకుమారి నిరాకరించారని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించారు. రత్నకుమారిని కలవడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదని చెప్పారు. తాను తీయనున్న ‘వంగవీటి’ చిత్రానికి సంబంధించి రంగా కుమారుడు రాధాకృష్ణను కలిసే ఉద్దేశం లేదని అన్నారు. ఎందుకంటే, తాను తీయనున్న ఈ చిత్రంలో రాధాకృష్ణ పాత్ర లేదని, అందుకే ఆయన్ని కలవాల్సిన అవసరం లేదని చెప్పారు. రంగా అనుచరులను కూడా కలుస్తానని పేర్కొన్నారు. కాగా, దేవినేని అపాయింట్ మెంట్ తనకు లభించిందని వర్మ వివరించారు.

  • Loading...

More Telugu News