: ఫిబ్రవరి 27న మేరీల్యాండ్‌ మెట్రో, వాషింగ్టన్‌ డీసీలో ఉరకలెత్తనున్న ‘గోదావరి'


మేరీల్యాండ్‌ మెట్రో, ఫిబ్రవరి 27, 2016: దక్షిణ భారత వంటకాలను అందిస్తూ.. యునైటెడ్‌ స్టేట్స్‌లో శరవేగంగా విస్తరిస్తున్న రెస్టారెంట్‌ల శ్రేణి ‘గోదావరి’ 27 ఫిబ్రవరి 2016న మెట్రో వాషింగ్టన్‌ డీసీ లోని మేరీల్యాండ్‌లో గైదర్స్‌బర్గ్‌లో తమ రెస్టారెంట్‌ను ప్రారంభించనుంది. ఫిబ్రవరి 20న న్యూజెర్సీలోని ఎడిసన్‌లో వీరు ప్రారంభించిన రెస్టారెంట్‌కు అక్కడ అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఇప్పుడు మేరీల్యాండ్‌ మరియు మెట్రో వాషింగ్టన్‌ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా చిరస్మరణీయంగా మిగిలిపోయే భోజన అనుభూతులను... సాధికారిక స్వదేశీ వంటకపు రుచుల ద్వారా అందించడంలో తనదైన శైలిని ‘గోదావరి’ కొనసాగించనుంది. వాషింగ్టన్‌ డీసీలోని బాల్టిమోర్‌, రాక్‌ విలే మరియు దక్షిణభారత వాసులు అత్యధికంగా నివసించే ఇతర అనేక ప్రాంతాలకు చాలా సమీపంలోనే ఈ 120 సీట్ల సదుపాయం ఉన్న రెస్టారెంట్‌ను ఏర్పాటుచేశారు. ప్రారంభోత్సవం రోజున చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్న గ్రాండ్‌ బఫే లో 'శర్మ దాభా ఆలూ ఫ్రై', 'ఆవకాయ చికెన్‌ వింగ్స్‌', 'బెజవాడ బాతు పులుసు', 'నిజామాబాద్‌ నిమ్మకాయ కుందేలు', 'చిట్టెమ్మ గారి చేతి గారెలు', 'రత్తమ్మ గారి రొయ్యల పులుసు', 'పెదరాయుడు పీతల ఇగురు', 'శ్రీదేవి షాహి టక్‌డా' ఇంకా అనేక వంటకాలు భోజనప్రియుల చవులూరించనున్నాయి. మేరీల్యాండ్‌ మరియు మెట్రో వాషింగ్టన్‌ డీసీ ప్రాంతంలోనే అతిపెద్ద లంచ్‌ బఫే గా.. గోదావరి బఫే నిలవనుంది. ఈ రెస్టారెంట్‌ ప్రారంభించడంపై మేరీల్యాండ్‌ గోదావరి ఫ్రాంచైజ్‌ ఓనర్‌ కామాక్షి తుమ్మలపల్లి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ''గోదావరి బృందంలో ఓ సభ్యురాలిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సొంత రెస్టారెంట్‌ తెరవాలనే కొన్నేళ్ల నాటి నా కలను సాకారం చేసినందుకు గోదావరికి చెందిన కౌశిక్‌ కోగంటి, తేజా చేకూరి లకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇక్కడి భారతీయులకు పసందైన స్వదేశీ రుచులు అందించాలనే కల సాకారం అవుతోంది’’ అని ఆమె అన్నారు. గోదావరి రెస్టారెంటుల శ్రేణిలో భాగం కాగలిగినందుకు మేరీల్యాండ్‌ ప్రాంతపు గోదావరి ఫ్రాంచైజ్‌ కో-ఓనర్‌ ప్రదీప్‌ రావెళ్ల కూడా సంతోషం వెలిబుచ్చారు. ''ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడానికి గోదావరి వారి బృందం మాకు చేసిన సహాయానికి నేను ముగ్ధుడనైపోయాను. ఇక్కడి భారతీయులకు తమ ఇంట్లో ఉన్నటువంటి అనుభూతి కలిగేలా స్వదేశీ రుచులను అందించడంలో భాగం అవుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది'' అని మేరీల్యాండ్‌ ప్రాంతంలో సినీ పంపిణీ రంగంలో కూడా ఉన్న ప్రదీప్‌ చెప్పారు. గోదావరి ఫ్రాంచైజీలు త్వరలోనే డిలావేర్‌, డలాస్‌ లలో కూడా ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యునైటెడ్‌ స్టేట్స్‌లోని ఇంకా అనేక ప్రాంతాలకు కూడా దక్షిణ భారత దేశపు రుచులను భోజన ప్రియులకు అందించడానికి ఇంకా ఎంతో మంది ఔత్సాహికులు కలిసి పనిచేయబోతున్నారు. తమ రెస్టారెంట్‌లకు వేల్యూ యాడెడ్‌ ప్రయత్నాల్లో భాగంగా గోదావరి వారు.. ఒక మొబైల్‌ అప్లికేషన్‌ను కూడా రూపొందిస్తున్నారు. దీని ద్వారా వినియోగదారులు తమ భోజన సమయాన్ని ప్లాన్‌ చేసుకోవడానికి రెస్టారెంట్‌కు కాల్‌ చేయాల్సిన అవసరం లేకుండా, యాప్‌ ద్వారా చేసుకోవడం వీలవుతుంది. అమెరికా వ్యాప్తంగా ఉన్న భారతీయులందరినీ స్వదేశీ రుచులతో సమ్మోహితుల్ని చేసిన తర్వాత.. కెనడా, సింగపూర్‌, ఆస్ట్రేలియా, యూకే లకు కూడా విస్తరించాలని టీమ్‌ గోదావరి వారు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రత్యేకించి ఎడిసన్‌లో ఘనంగా జరిగిన గోదావరి ప్రారంభోత్సవం నాడు ఆ ప్రాంతంలో కిటకిటలాడిపోయిన జనం రద్దీని నియంత్రించడంలో ఎంతో సహకరించిన ఎడిసన్‌లోని పోలీసు మరియు ఫైర్‌ శాఖల వారికి గోదావరి న్యూజెర్సీ టీం వారు ఒక ప్రకటనలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 27న ప్రత్యేకమైన గ్రాండ్‌ లంచ్‌ బఫేతో ప్రారంభించి.. మేరీల్యాండ్‌ వినియోగదారులకు గోదావరి రుచులను అందించడాన్ని కొనసాగించగలమని విశ్వసిస్తున్నాం. సదా మీ సేవకై నిరీక్షిస్తూ.. గోదావరి మేరీల్యాండ్‌ 9011 గైదర్‌ రోడ్‌, గేదర్స్‌బర్గ్‌, ఎండి 20877. ఫోను: 301-977-8600 మా సేవలతో మీరు సదా ఆనందించగలరని ఆశిస్తూ మరోసారి కృతజ్ఞతలు. ద‌య‌చేసి సంప్రదించండిః ప్రదీప్‌ రావెళ్ల MD@GODAVARIUS.COM 443-784-9999 www.Godavarius.com Press note released by: IndianClicks, LLC

  • Loading...

More Telugu News