: మోదీ, పవన్ కల్యాణ్ ల కాళ్లు పట్టుకుని బాబు గెలిచారు: ఎమ్మెల్యే రోజా
ప్రధాని నరేంద్ర మోదీ, సినీ హీరో పవన్ కల్యాణ్ ల కాళ్లు పట్టుకుని ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదు, లోటస్ పాండ్ లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. తనకుండేదే క్యారెక్టరనీ, తన రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదని అన్నారు. క్యారెక్టర్ లేని వారి జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నంబర్ వన్ స్థానం దక్కుతుందంటూ తీవ్రంగా ఆరోపించారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చేసిన ఘనత చంద్రబాబుదేనని... ఎన్టీఆర్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకున్న తప్పుడు క్యారెక్టర్ చంద్రబాబుదంటూ మండిపడ్డారు. కాగా, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సవాల్ కు రోజా ప్రతిసవాల్ విసిరారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారని, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని రోజా అన్నారు.