: అర్జున్ కపూర్ కి క్లాస్ పీకిన సైఫ్ అలీఖాన్!
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ కు మరో హీరో సైఫ్ అలీఖాన్ మెత్తగా క్లాసు పీకాడట. ముఖ్యంగా సీనియర్ నటులకు గౌరవ మర్యాదలు ఏవిధంగా ఇవ్వాలనే విషయమై ఆ యువహీరోకు సైఫ్ హితబోధ చేశాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. అందుకు కారణం... ఒక మిడ్ నైట్ ఫోన్ కాల్. సైఫ్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తో కలసి అర్జున్ కపూర్ 'కీ అండ్ కా' సినిమాలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అర్జున్, కరీనాల మిడ్ నైట్ కాల్స్ ఎక్కువయ్యాయట. గంటల కొద్దీ మాట్లాడుకుంటున్నారట. ఈమధ్య ఒక రోజు అర్ధరాత్రి అర్జున్, కరీనాకు మిడ్ నైట్ కాల్ చేశాడు. అయితే, ఆ కాల్ ని సైఫ్ రిసీవ్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా సీనియర్ నటులకు మర్యాద, గౌరవం ఎలా ఇవ్వాలన్న విషయమై అర్జున్ కి ఏకధాటిగా క్లాస్ పీకాడని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, అర్జున్, కరీనా ల 'కీ అండ్ కా' చిత్రంలో వారి మధ్య కిస్ సీన్లు మోతాదుకు మించి ఉన్నాయని సమాచారం.