: తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతి


తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఐఏఎస్ అధికారులు రజిత్ కుమార్, రామకృష్ణారావు, హరిప్రీత్ సింగ్, అరవింద్ కుమార్, అశోక్ కుమార్ లకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. 1991 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారులను అడిషనల్ డీజీలుగా, 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు ఐజీలుగా, 2002 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ లకు డీఐజీలుగా పదోన్నతులు కల్పించింది. వారిలో సీవీ ఆనంద్, రాజీవ్ రతన్ కు అడిషనల్ డీజీగా, విక్రమ్ సింగ్, ఆర్ బీ నాయక్, బి.మల్లారెడ్డి, మురళీకృష్ణ, శివప్రసాద్ కు ఐజీలుగా పదోన్నతి కల్పించింది. రాజేశ్ కుమార్, శివశంకర్ రెడ్డికి డీఐజీలుగా ప్రమోషన్ లభించింది. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News