: అక్షయ గోల్డ్ కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేయండి: హైకోర్టు ఆదేశం
చిట్ ఫండ్ కంపెనీ పేరుతో ప్రజలను నిలువెత్తునా ముంచిన అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసులపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ముందుగా అక్షయ గోల్డ్ కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ సీఐడీని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఈ కేసులో 10 మంది అరెస్టు చేశామని, మరో 18 మందికి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినట్టు సీఐడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు అగ్రిగోల్డ్ కేసులో జరిగిన విచారణలో, ఆస్తుల వేలంపై ధరలు నిర్ధారిస్తున్నామని, 15 రోజుల్లో కోర్టుకు తెలుపుతామని రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తెలిపింది. దీనికి స్పందించిన కోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది. అయితే ఈ కేసులో బినామీ ఆస్తులపై మరింత లోతుగా దర్యాప్తు జరపాలని, ఏపీ సీఐడీ అటాచ్ చేసిన 70 ఆస్తులను కమిటీకి ఇవ్వాలని ఆదేశించింది. చివరగా ఈ రెండు కేసుల్లో ఆస్తులపై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాలకు కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.