: జగన్ వైఖరి వల్లే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు: డొక్కా
వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడంపై జగన్ చేస్తున్న విమర్శలను టీడీపీ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ తప్పుబట్టారు. అసలు జగన్ వైఖరి, ప్రవర్తన వల్లే వైసీపీ శాసనసభ్యులు ఆ పార్టీని వీడుతున్నారని అన్నారు. ముందు ఆయన ఆ విషయం తెలుసుకోవాలని గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సూచించారు. అసలాయన పద్ధతి, మాట తీరు మార్చుకుంటే మంచిదన్నారు. పెద్దగా అరవడం మాని ప్రశాంతంగా ఆలోచించుకోవాలని హితవు పలికారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలంటున్న జగన్, ప్రకాశం జిల్లా పరిషత్ విషయంలో టీడీపీ జడ్పీటీసీతో ఎందుకు రాజీనామా చేయించకుండా ఉన్నారో సమాధానం చెప్పాలని డొక్కా డిమాండ్ చేశారు.