: వర్షాలకు అవకాశం... ఉపరితల ఆవర్తనాలతో తగ్గిన ఎండ వేడి!
విదర్భ, బెంగాల్ మీదుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటంతో ఎండ వేడిమి స్వల్పంగా తగ్గింది. వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా కనిపించింది. నిన్నటి వరకూ 38 డిగ్రీల వరకూ చేరుకున్న వేడి, నేడు 34 డిగ్రీలకు దిగివచ్చింది. వచ్చే 24 గంటల్లో బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రతో పాటు, చత్తీస్ గఢ్ లోనూ వర్షాలు పడొచ్చని, రెండు రోజుల పాటు దీని ప్రభావం కొనసాగుతుందని వివరించారు.