: చంద్రబాబు కొత్త పలుకు!...ఎక్కువ మంది పిల్లలను కనండి, జనాభాను పెంచండి... ముఖ్యమంత్రి పిలుపు!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు నిన్న సరికొత్త పిలుపునిచ్చారు. ‘‘ఎక్కువ మంది పిల్లలను కనండి. రాష్ట్ర జనాభాను పెంచండి’’ అంటూ ఆయన చేసిన సరికొత్త ప్రకటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో నిన్న 'కాపు రుణమేళా’ పేరిట జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు కాపులకు రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు... రాష్ట్రంలో క్రమంగా తగ్గిపోతున్న యువత సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఏపీలో జనాభా శాతం తగ్గుతోంది. మరణాల సంఖ్యతో సమానంగా జననాలు ఉన్నాయి. జనాభాలో యువత శాతం తగ్గుతోంది. ఇప్పటికే చాలా దేశాల్లో జనాభా శాతంలో యువత తగ్గిపోవడంతో ఆయా దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. భవిష్యత్ పై ఆందోళనలో ఉన్నాయి. మనం కూడా దూరదృష్టితో ఆలోచించాలి. పిల్లల విషయంలో మనం మరింత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News