: కంటతడిపెట్టిన నన్నపనేని!... లైంగిక దాడి బాధితులను పరామర్శిస్తూ భావోద్వేగానికి గురైన వైనం


టీడీపీ సీనియర్ నేత, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కళ్ల వెంట నీళ్లు సుడులు తిరిగాయి. అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైన చిన్నారులను పరామర్శిస్తున్న సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఉన్నచోటే కూర్చుండిపోయిన ఆమె వెక్కివెక్కి ఏడ్చారు. ఆపై అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ దుర్మార్గుడి తాట తీస్తామంటూ ప్రకటన చేశారు. వివరాల్లోకెళితే... పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం వేగివాడలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో పాటు అదే వయస్సున్న మరో ఇద్దరు బాలికలను గ్రామానికి చెందిన మరియన్న అనే వ్యక్తి వేధించాడు. దీనిపై సమాచారం అందుకున్న గ్రామస్థులు నిన్న అతడికి బడితె పూజ చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి నిన్న పత్రికల్లో వచ్చిన కథనాలపై వేగంగా స్పందించిన నన్నపనేని నేరుగా పెదవేగికి వెళ్లారు. గ్రామస్థులతో మాట్లాడారు. బాధిత బాలికలతో స్వయంగా మాట్లాడారు. తమపై జరిగిన దాడి గురించి బాధిత చిన్నారులు వివరిస్తున్న సమయంలో భావోద్వేగానికి గురైన నన్నపనేని కంటతడిపెట్టారు.

  • Loading...

More Telugu News