: రైల్వే బడ్జెట్ ప్రజలను మోసం చేసింది: లాలూ
ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2016-17 రైల్వే బడ్జెట్ పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ ప్రజలకు ఏమీ ప్రకటించకుండా మోసం చేసిందన్నారు. అంతేగాక ప్రయాణికుల భద్రతకు బడ్జెట్ లో ఎక్కడా ప్రాధాన్యత లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పిందని ఆరోపించారు. తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రూ.60వేల కోట్ల మిగులు సాధించినట్టు లాలూ చెప్పారు.