: రైల్వే బడ్జెట్... అందరికీ నచ్చే ఐదు నిర్ణయాలు!
దాదాపు గంటకు పైగా పార్లమెంటులో ప్రసంగించి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో ప్రతి ఒక్కరికీ నచ్చేలా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. అవేంటంటే... * వయోవృద్ధులకు లోయర్ బెర్తులు - వీటివల్ల సీనియర్ సిటిజన్లు పైన ఉండే బెర్తులకు వెళ్లేందుకు ఇక అవస్థలు పడక్కర్లేదు. * రైలు ప్రయాణికులకు స్థానిక ఆహారం - ఈ నిర్ణయం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నా ఆహారం విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం రాబోదు. * చిన్నారుల కోసం ఆహారం, వేడి నీళ్లు - ప్రయాణాల్లో తల్లులు పడే బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఇక పాల బాటిల్ కడిగేందుకు వేడి నీరు లభించక పడ్డ ఇబ్బందులు అందరు తండ్రులకూ అనుభవమే. వీటి నుంచి విముక్తి లభిస్తుంది. * 139 నంబరు ద్వారా టికెట్ రద్దు - టికెట్ల రద్దు కోసం వెళ్లి, బుకింగ్ కోసం వచ్చే వారితో సమానంగా క్యూ లైన్లలో గంటల తరబడి నిలుచునే అగత్యం తప్పుతుంది. * ఎస్ఎంఎస్ చేస్తే బోగీ శుభ్రం - రైలు బోగీల్లో గంట గంటకూ పెరిగే చెత్తను శుభ్రం చేయించుకునేందుకు ఇకపై ఒక్క ఎస్ఎంఎస్ ఇస్తే సరిపోతుంది. ఎటొచ్చీ ఈ సేవలు ఎప్పటి నుంచీ మొదలవుతాయన్నదే తెలియని విషయం.