: స్కార్ఫ్, దుప్పట్టాలను నిషేధించిన పాఠశాల


విద్యార్థినులు ముఖం కనిపించకుండా ఏ విధమైన స్కార్ఫ్ లేదా దుపట్టాలను కట్టుకోరాదని ఇంపాల్ లోని ఓ ప్రైవేటు పాఠశాల ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి బ్రైటర్ అకాడమీ ఈ ఆదేశాలు జారీ చేయగా, ఆల్ మణిపూర్ ముస్లిం గర్ల్ స్టూడెంట్స్ యూనియన్ తీవ్రంగా ఆక్షేపించింది. స్కార్ఫ్ ల నిషేధం ముస్లిం మత విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకమని, తక్షణం వీటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో డ్రస్ కోడ్ ను నిర్ణయించిన తరువాత, కులమతాలకు అతీతంగా వాటిని అందరూ పాటించాల్సిందేనని, ఇందులో మార్పుండదని స్కూలు అధికారులు స్పష్టం చేశారు. పాఠశాల చర్యలతో పలువురు ముస్లిం విద్యార్థినులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని, విషయాన్ని విద్యాశాఖా మంత్రి దృష్టికి తీసుకెళ్లినా కల్పించుకోలేదని యూనియన్ నేత రుక్సార్ చౌదరి ఆరోపించారు. స్కార్ఫ్, దుపట్టాలపై నిషేధాన్ని తొలగించాలని హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News