: హైదరాబాద్ లో మరోమారు అక్రమ నిర్మాణాలపై కొరడా
హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో మరోమారు అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఈ రోజు పంచాయతీ అధికారులు చేపట్టారు. గత ఏడాది ఒక అపార్ట్ మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో కొంతమంది మరణించడం, తీరా ఆ అపార్ట్ మెంట్ అక్రమ నిర్మాణమని తేలడంతో పంచాయతీ అధికారులు లోగడ కూడా పలు నిర్మాణాలను కూల్చివేశారు. తాజాగా మరోమారు అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, పంచాయతీ అధికారుల చర్యను స్థానికులు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.