: ప్రపంచ ఆర్కిటెక్ట్ నిపుణులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
విఖ్యాత ఆర్కిటెక్ట్ నిపుణులతో సీఎం చంద్రబాబు బుధవారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లండన్ కు చెందిన రిచర్జ్ రోజర్స్, టోక్యోకు చెందిన మాకి, భారత సంతతికి చెందిన జోషిలతో మాట్లాడారు. నూతన రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ రూపు రేఖలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని వారికి సూచనలు చేశారు. వాటి నిర్మాణ నమూనాల రూపకల్పన విషయంలో తన అభిప్రాయాలు తెలియజేశారు. త్వరలోనే వీటికి సంబంధించిన నమూనాలను వారు సీఎంకు సమర్పించనున్నారు.