: మరింత తగ్గిన క్రూడాయిల్ ధర!


క్రూడాయిల్ ఉత్పత్తిని మరింతగా పెంచాలని ఒపెక్ తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర మరింతగా పతనమైంది. బుధవారం నాడు బ్రెంట్ క్రూడాయిల్ ధర క్రితం బ్యారల్ కు ముగింపుతో పోలిస్తే 15 సెంట్లు పడిపోయి 33.12 డాలర్లకు చేరింది. అంతకుముందు సౌదీ అరేబియా, ఇరాన్ తదితర దేశాలు ఉత్పత్తిని తగ్గించేందుకు ససేమిరా అన్నాయి. ఒపెక్ సభ్య దేశాలేవీ ముడిచమురు వెలికితీతను తాత్కాలికంగా ఆపేందుకు సిద్ధంగా లేవని సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి అలీ అల్-నైమీ వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో యూఎస్ వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర 38 సెంట్లు పడిపోయి 31.49 డాలర్లకు చేరింది. ప్రపంచ డిమాండ్ కన్నా 10 నుంచి 20 లక్షల బ్యారళ్ల అదనపు ముడిచమురు మార్కెట్లోకి వస్తున్నందునే ధరలపై ఒత్తిడి ఉందని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News