: నియోజకవర్గ అభివృద్ధి కోసమే సైకిలెక్కా!... బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు ప్రకటన


వైసీపీ టికెట్ పై గడచిన ఎన్నికల్లో విజయం సాధించిన బద్వేల్ ఎమ్మెల్యే తిరివీది జయరాములు టీడీపీలో చేరిపోయారు. నేటి ఉదయం కడప జిల్లా నుంచి బయలుదేరి విజయవాడ చేరుకున్న జయరాములు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సైకిలెక్కేశారు. ఈ సందర్భంగా తాను పార్టీ మారడానికి గల కారణాలను ఆయన చెప్పారు. తనకు తొలిసారిగా టికెట్ ఇచ్చి గెలిపించిన వైసీపీ అధికారంలోకి రాకపోవడం దురదృష్టకరమేనని ఈ సందర్భంగా జయరాములు అభిప్రాయపడ్డారు. అయితే తనపై విశ్వాసముంచి గెలిపించిన బద్వేల్ ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించాలని తపించానన్నారు. విపక్షంలో కూర్చున్న వైసీపీలో ఉండగా... ఆ పని సాధ్యం కాదని తేలిపోయిందన్నారు. ఈ క్రమంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలతో సంతృప్తి చెంది... నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News