: ఉమర్ ఖలీద్, అనిర్బన్ లను పోలీసులు అడిగిన ప్రశ్నలివే!


గతరాత్రి 2 గంటల సమయంలో సరెండరయిన జేఎన్యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను పోలీసులు 5 గంటల పాటు విచారించి 9 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, వారిని అడిగిన ప్రశ్నలివే. 1. ఇన్ని రోజులూ తప్పించుకుని ఎక్కడికి వెళ్లారు? 2. మీరు దాక్కోవడానికి సహకరించిన వారు ఎవరు? 3. మీ ఖర్చులకు డబ్బులు ఇచ్చింది ఎవరు? 4. ఫిబ్రవరి 9 నాటి కార్యక్రమానికి మీరు అనుమతి తీసుకున్నారా? 5. అన్ని నినాదాలూ మీరే చేశారా? 6. ఎవరెవరు జాతి వ్యతిరేక నినాదాలు చేశారు? 7. కన్నయ్య కుమార్ కూడా భారత్ కు వ్యతిరేకంగా నినదించాడా? 8. వర్శిటీ విద్యార్థులు కాకుండా బయటివారు కార్యక్రమానికి వచ్చారా? వారు ఎవరు? 9. ఇదే తరహా కార్యక్రమాలను గతంలో కూడా చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టిన పోలీసు వర్గాలు తదుపరి వీరిని కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News