: రాజ్యసభలో గందరగోళం... రోహిత్ ఆత్మహత్యపై మాట్లాడిన మాయావతి


బడ్జెట్ సమావేశాలు మొదలైన రెండో రోజే రాజ్యసభలో గందరగోళం చోటు చేసుకుంది. సభ ప్రారంభమైన వెంటనే బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయవతి హెచ్ సీయూ ఘటనపై మాట్లాడారు. సెంట్రల్ వర్సిటీల్లో దళిత విద్యార్థులను అణచివేస్తున్నారని, వర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాప్తికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే హెచ్ సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె విమర్శించారు. అయితే ఆమెకు ఇచ్చిన సమయం ముగిసిన తరువాత కూడా మాట్లాడుతుండటంతో డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ కూర్చోవాలని కోరారు. అయినా ఆమె పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండడంతో కురియన్ పలుమార్లు మాయావతిని వారించారు. ఈలోగా విపక్ష సభ్యులు బీజేపీ ముర్దాబాద్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభలో హెచ్ సీయూ ఘటనపై మాట్లాడేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పలువురు సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తుండడంతో... డిప్యూటీ ఛైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News