: బ్యాంకు డిపాజిట్లపై పన్ను రాయితీలు!


వచ్చే వారంలో పార్లమెంట్ ముందుకు రానున్న వార్షిక బడ్జెట్ లో బ్యాంకు డిపాజిట్లపై ఉన్న పన్ను రాయితీల పరిధి పెరుగుతుందని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు బ్యాంకుల్లో దాచుకునే డిపాజిట్లపై ప్రస్తుతం సాలీనా రూ. 10 వేల వరకూ వడ్డీపై ఎటువంటి పన్నులు చెల్లించనవసరం లేదు. ఈ మొత్తాన్ని సాధ్యమైనంత వరకూ పెంచే అవకాశాలు ఉన్నాయని బీఎంఆర్ లీగల్ మేనేజింగ్ పార్ట్ నర్ ముఖేష్ బుటానీ అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జైట్లీ వడ్డీ అవధులను పెంచవచ్చని తెలిపారు. ఇదే సమయంలో వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే ప్రయత్నం చేస్తామని 2015-16 బడ్జెట్లో జైట్లీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ సంవత్సరం రెండు శాతం వరకూ కార్పొరేట్ పన్ను తగ్గిస్తూ, ప్రతిపాదనలు వెలువడవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News