: నేనేమీ అలా అనలేదు... యాపిల్, ఎఫ్బీఐ వివాదంపై మాటమార్చిన బిల్ గేట్స్!


ఓ హంతకుడికి చెందిన యాపిల్ ఫోన్ అన్ లాక్ విషయమై జరుగుతున్న వివాదంలో తానన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. తాను ఎఫ్బీఐకి మద్దతుగా మాట్లాడానని వార్తలు రావడం అసంతృప్తిని కలిగించిందని, తానేమీ అలా అనలేదని స్పష్టం చేశారు. కాగా, యాపిల్ సంస్థ అమెరికన్ అధికారులకు ఫోన్ లాక్ తొలగించే విషయంలో సహకరించాలని గేట్స్ అభిప్రాయపడ్డట్టు నిన్న వార్తలు రాగా, నేడు వాటిని స్వయంగా ఆయనే ఖండించడం గమనార్హం. ఇదిలావుండగా, కోర్టు తీర్పు ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిపై కోర్టులో పోరాటం చేస్తామని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News