: 'జాట్' ఎఫెక్ట్... ఒక్క రోజే 210 రైళ్లు రద్దు...మొత్తం 1152 రైళ్లు రద్దు


హర్యాణాలోని జాట్ల ఆందోళనలు తారస్థాయికి చేరడంతో ఆ రాష్ట్రం మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దవుతున్నాయి. నేడు ఒక్క రోజులో 210 రైళ్లు రద్దయ్యాయంటే హర్యాణాలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. దీంతో జాట్ల ఆందోళన మొదలైన తరువాత మొత్తం 1152 రైళ్లు రద్దయ్యాయి. ఢిల్లీ-పానిపట్-అంబాలా, ఢిల్లీ-రోహ్ తక్-భటిండా మార్గాలు నేడు అసలు తెరుచుకోలేదు. జాట్ల ఆందోళనతో హర్యాణా, పంజాబ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ ప్రధాన రైలు మార్గాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News