: జపాన్ ఎయిర్ లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ముప్పు
జపాన్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. సప్పోర్ లోని న్యూ చిటొసి ఎయిర్ పోర్టులో బోయింగ్ 373 విమానం టేకాఫ్ అయ్యే సమయంలో విమానంలోని ఇంజిన్ లో మంటలు లేచాయి. దీంతో విమానంలో పొగలు అలముకున్నాయి. దీనిని గమనించిన విమాన సిబ్బంది టేకాఫ్ చేయకుండా నిలిపేశారు. ఈ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. కాగా, వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ ఘటనలో పొగ కారణంగా నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.