: ఏమయ్యా, సిగ్గు లేకుండా...చిన్న పిల్లోడిపై రాజకీయాలా?: సోమిరెడ్డిపై తలసాని ఫైర్
'ఏమయ్యా, సిగ్గు లేకుండా ఫ్యామిలీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు...ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ చేసేది ఫ్యామిలీ రాజకీయం కాదా?' అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నిలదీశారు. ఓ టీవీ ఛానెల్ లో జరిగిన చర్చలో తలసాని టీడీపీపై నిప్పులు చెరిగారు. 'ఆంధ్రప్రదేశ్ లో నిన్నమొన్న రాజకీయాల్లోకి వచ్చిన ఆ చిన్న పోరడిపైన రాజకీయాలు చేస్తున్నారు, మీకేమన్నా సిగ్గుందా?' అని అడిగారు. తెలంగాణలో కుటుంబ రాజకీయాలని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ చేసేవి ఏ రాజకీయాలని ఆయన నిలదీశారు. టీడీపీది మొదటి నుంచి ఇదే తీరని ఆయన విమర్శించారు. టీడీపీ చేస్తే ఒప్పు, ఇతర పార్టీలు చేస్తే తప్పు అనడం సరికాదని ఆయన హితవు పలికారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని గుర్తించాలని ఆయన సూచించారు. పరిటాల హత్యలో జేసీ కుటుంబం నిందితులా? లేక జగన్ నిందితుడా? ఎందుకయ్యా, ఆయనపై లేనిపోని నిందలేస్తారు? అని ఆయన అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనకు ఆసక్తిలేదని, అక్కడ ఏం జరిగితే తనకు ఎందుకని చెప్పిన ఆయన, తనపై గతంలో టీడీపీ లెక్కలేనన్ని ఆరోపణలు చేయడంతోనే తాను ఇలా అడగాల్సి వస్తోందని స్పష్టం చేశారు.