: రాష్ట్రపతితో జగన్ భేటీ.. ఏపీలో సమస్యలపై ఏకరువు పెట్టిన వైఎస్సార్సీపీ అధినేత


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఈరోజు సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా చూడాలని ఆయనకు జగన్ విజ్ఞప్తి చేశారు. జగన్ వెంట వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, నిన్న ఢిల్లీకి వెళ్లిన జగన్ పలువురు నేతలను కలవాలనుకున్నప్పటికీ అపాయింట్ మెంట్ లభించలేదు. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ లతో వరుస భేటీలు నిర్వహించాలని జగన్ అనుకున్నారు. అయితే, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ మాత్రమే లభించడంతో ఈరోజు జగన్ ఆయనతో భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News