: హీరో రానా టీవీ షో... మార్చ్ 1 నుంచి ప్రసారం


హీరో రానా కూడా టెలివిజన్ తెరపై కనిపించబోతున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ షో చేసేందుకు సిద్ధమయ్యాడు. 'డిస్కవరీ రియల్ హీరోస్' పేరుతో డిస్కవరీ తమిళ ఛానల్లో ఈ షో ప్రసారమవుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ షో మార్చి 1 నుంచి ప్రారంభమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వివిధ భౌగోళిక ప్రదేశాల్లో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు రియల్ లైఫ్ హీరోలు చూపే తెగువ, పట్టుదల, నిబద్ధతలను రానా ఈ షోలో చూపిస్తాడు. బేర్ గిల్స్, లెస్ స్ట్రౌడ్, ఎడ్ స్టాఫర్డ్, జోయెల్ లాంబెర్ట్ ఇలా అనేకమంది ఇప్పటివరకు ఎవరూ ఎదుర్కోని విపత్కర పరిస్థితుల నుంచి తామెలా బయటపడ్డామో తమ రియాలిటీ షోల ద్వారా చూపి, అందుకు కొన్ని టిప్స్ కూడా చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత స్పూర్తిమంతమైన, యాక్షన్ తో కూడిన ప్రయాణాలను ఈ షోలో రానా పరిచయం చేస్తారని డిస్కరీ నెట్ వర్క్స్ ఏషియా-పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ జోహ్రి తెలిపారు.

  • Loading...

More Telugu News